పోగొట్టుకున్న బాధితుడికి 24గంటల్లోనే...సూట్ కేసు

 



State Politics News【Nellore】:

 ఎస్ కె యాసిన్ భాష s /o చిన్న అలీ భాష,రామచంద్ర పురం, కలసపాడు, కడప జిల్లాకు చెందిన వ్యక్తి సర్టిఫికెట్ లు మరియు బట్టలు  కలిగిన బ్రౌన్ కలర్ సూట్ కేసు 22/07/2021 తేదీన ఆత్మకూరు బస్టాండ్ వద్ద మిస్ అయ్యింది.దీనితో  బాధితుడు నవాబ్ పేట పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసాడు.ఈ మేరకు  నవాబ్ పేట పోలీస్ లు వెతికి  పోగొట్టుకున్న సూట్ కేసు ను సదరు భాదితుడికి ఎస్సై రమేష్ బాబు శుక్రవారం అప్పగించారు. 24గంటల్లోనే పోగొట్టుకున్న సూట్ కేసు కనుగొన్న సిబ్బందిని స్టేషన్ హౌస్ ఆఫీసర్ సుబ్బారావు అభినందించారు. ఈ కార్యక్రమంలో  క్రైమ్ హెడ్ కానిస్టేబుల్ తురక శ్రీనివాసులు,కానిస్టేబుల్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.