State Politics News【Nellore】:
జగనన్న కాలనీ లో ఇండ్ల స్థలాలు పొందిన పేదలు శంఖుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. నెల్లూరు నగరం భగత్ సింగ్ కాలనీ,జాతీయ రహదారి ప్రక్కన ఉన్న జమ్మిపాలెం రోడ్డు ప్రాంతాలల్లో లబ్ధిదారులు శనివారం తమ తమకు కేటాయించిన స్థలాల్లో శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా 10వ డివిజన్ ఇంచార్జ్ కొండా శివారెడ్డి,డివిజన్ సీనియర్ నాయకుడు, బీసీ సెల్ నగర అధ్యక్షుడు ఉప్పల శేషు గౌడ్ లు పాల్గొని లబ్ధిదారులకు పలు సూచనలిచ్చారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా నిరుపేదలకు సొంత స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకునేందుకు సహాయం చేస్తున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని,సీఎం జగన్మోహన్ రెడ్డి కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు వారన్నారు.ఈ కార్యక్రమంలో 10వ డివిజన్ నాయకులు,కార్యకర్తలు కొండారెడ్డి, గోవింద్ రాజులు,యాకుబ్, శ్రీనివాసులు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.