State politics news【Nellore】:
నెల్లూరు నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ మరియు కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజా ప్రయోజనం దృష్ట్యా నెల్లూరు నగర పాలక సంస్థ అధికారిక వెబ్సైట్ www.nelloremc.com ను ప్రారంభించారు. ఈ వెబ్సైట్ ద్వారా నగరపాలక సంస్థ అందిస్తున్న వివిధ సేవలను తెలుసుకోవడంతో పాటు, నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన వివిధ టాక్స్ లను కూడా ప్రజలు నేరుగా చెల్లించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె.దినేష్ కుమార్, అడిషనల్ కమీషనర్ ఎ. ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.