ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

 


State Politics News【Nellore)

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెల్లూరు నగరంలో ఘనంగా యోగా దినోత్సవంను బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక నీలగిరి సంగం ,39 వ డివిజన్, ఫత్తే ఖాన్ పేట లో సోమవారం బీజేపీ మండల కార్యాలయం మిద్దె పైన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా మాస్టర్ ఆనంద్ రెడ్డి  ఆసనాలు  వేసి చూపించారు . అలాగే పలువురు చే ఆసనాలు వేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కార్యదర్శి యకసిరి ఫణిరాజు , ఏపీ స్టేట్ లీగల్ కో కన్వీనర్ రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. 


        ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాభ్యాసం చేయాలని ,శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.కరోనా వైరస్ సమయం లో యోగాసనాలు ఎంతో సహాయ పడతాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో చిరువెళ్ళ చంద్రశేఖర్ , భాస్కర్ పెందెల, గురు ప్రసాద్, రాజశేఖర్, గుంజి రాజేష్, జేశ్వంత్, సుమన్, సాయి,  ప్రదీప్, మధు, వేలూరు మహేష్, స్థానిక మండల అధ్యక్షుడు చిలక ప్రవీణ్ కుమార్ మరియూ కార్యకర్తలు పాల్గొన్నారు.