మాట తప్పిన వై యస్ జగన్:టీడీపీ నేత కోటంరెడ్డి ధ్వజం

 


State politics news【Nellore】:

 ప్రజల మీద పన్నుల భారం మోపకుండా పాలన సాగిస్తానని చెప్పిన జగన్ సీఎం అయ్యాక మాట తప్పారని భారీగా  పన్నుల భారం మోపబోతున్నారని టీడీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వెయ్యి రూపాయలు కట్టిన ఇల్లు కూడా ఇప్పుడు 4వేల నుంచి 5 వేలు కట్టాల్సి ఉంటుందని,ఇంటి పన్నులు పెంచితే ఒప్పుకోమని వ్యాపారస్తులపై భారీగా పన్నుల భారం పడబోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు . గురువారం నగరంలోని బాలాజీ నగర్  తన నివాసంలో
మీడియాతో సిటీ ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మాట్లాడారు.  ప్రజల నుంచి  నెల్లూరు కార్పొరేషన్ నెలకు కోటి రూపాయలు పన్నుల రూపంలో వసూళ్లు చేస్తుందని, ఇంటి పన్నులు పెంచితే కట్టబోమని సహాయ నిరాకరణ చేస్తామని అన్ని పార్టీలను కలుపుకుని పోయి ఉద్యమం చేస్తామన్నారు.
లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ చంద్రబాబు పైసా పన్నుల పెంచకుండా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించారు. వేల కోట్ల అధిపతిగా ఉన్న బొత్సాకి నిరుపేదల కష్టాలు ఏం తెలుసు..? అని,
చెత్త పన్ను కూడా కార్పొరేషన్ వసూలు చేయడం సిగ్గుచేటన్నారు.  గతంలో ఇంటికి రూపాయి ఇస్తే చెత్త సేకరిస్థాని ప్రతిపాదనలు వస్తే అప్పటి ఎమ్మెల్యే అనిల్, శ్రీధర్ రెడ్డిలు గగ్గోలు పెట్టారని,ఇప్పుడు పన్నుల భారంపై వాళ్ళు ఎందుకు నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కార్పొరేషన్ లో ఎన్నికలు జరిగిన వెంటనే ప్రజలపై పన్నుల భారం పడబోతుందని, దద్దమ్మ ప్రభుత్వం రాష్ట్రంలో నడుస్తుందని జగన్ గద్ద లాగా ప్రజలను పీక్కుతింటున్నాడని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు నగర ప్రజల కోసం త్వరలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొత్త పంథాలో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్ పాల్గొన్నారు.