State politics news【Nellore】:
నెల్లూరులో అక్రమ గుట్కా రవాణాని నవాబుపేట్ పోలీసులు గుట్టురట్టు చేసారు.వివరాల్లోకి వెళితే.... నవాబుపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పప్పుల వీధిలో అక్రమంగా గుట్కాలు నిల్వ చేసి వ్యాపారం చేస్తున్న వ్యక్తిని పోలీసులు దాడులు నిర్వహించి అదుపులోకి తీసుకున్నామని నవాబుపేట్ సిఐ సుబ్బారావు తెలిపారు.
సోమవారం నవాబుపేట్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా ఎస్పీ ఆదేశాలు మేరకు,ఏ ఎస్పీ వెంకట రత్నం పర్యవేక్షణ లో నగర డిఎస్పీ శ్రీనివాసులు రెడ్డి నేతృత్వంలో నవాబుపేట్ సిఐ సుబ్బారావు ఆధ్వర్యంలో స్టేషన్ ఎస్సైలు వారి సిబ్బంది కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పప్పుల వీధికి చెందిన అయితా కాళీ ప్రసాద్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చైన్నై నుండి అక్రమంగా గుట్కాలు నిల్వ చేసి నెల్లూరు లో పలు షాప్ లకు అధిక ధరలకు అమ్ముకుంటూ వ్యాపారం చేస్తూ ముద్దాయి సొమ్ము చేసుకునేవాడని తెలిపారు.అతనిని చాక చక్యంగా నవాబుపేట్ పోలీసులు కాపు కాసి పట్టుకుని అతని వద్ద నుండి 1,05,410 రూపాయలు విలువ చేసే 6,772 గుట్కా,మట్కా,తంబాకు ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా సిఐ సుబ్బారావు, ఎస్సైలు శివప్రకాశ్, రమేష్ బాబు,హెడ్ కానిస్టేబుల్ తురక శ్రీనివాసులు, కానిస్టేబుళ్లు సురేంద్ర,మోహన్ లను ఎస్పీ, డిఎస్పీ లు అభినందించారు.