State politics news【Nellore】:
నెల్లూరు నగరంలోని స్థానిక 7 వ డివిజన్ వైకాపా ఇంచార్జ్ కిన్నెర మాల్యాద్రి ఆధ్వర్యంలో గురువారం వై ఎస్ ఆర్ సి పి పార్టీ కార్యాలయంలో కరోనా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకు వ్యాక్సిన్ వేయించారు. కరోనా బ్లాక్ ఫంగస్ మహమ్మారి తో డివిజన్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలుబు, తలనొప్పి, జ్వరం ఇలాంటి లక్షణాలు కనబడితే వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించుకొని తగిన వైద్యం చేయించుకోవాలని డివిజన్ ఇంచార్జి కిన్నెర మాల్యాద్రి అన్నారు.
నగరంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కరోనా బ్లాక్ ఫంగస్ కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని ఎప్పటికప్పుడు ఆసుపత్రులను పర్యవేక్షిస్తూ వైద్య సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారని తెలిపారు. డివిజన్ ప్రజలును కూడా ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ అధైర్య పడకుండా ధైర్యంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వైకాపా యువనేత కిన్నెర సాగర్ ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.