State politics news【Nellore】:
నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేట ఆర్ ఎస్ ఆర్ నగరపాలక ఉన్నత పాఠశాల విద్యార్థులు అనుదీప్, లక్ష్మీ శిరీష, వాత్సవ సాయి, వెంకట రాజ్యలక్ష్మి , నవిత శ్రీ జాతీయస్థాయిలో నిర్వహించబడిన పోటీనందు విజేతలుగా నిలిచి నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్లకు సెలెక్ట్ అయ్యారు. వీరికి ప్రతి సంవత్సరం, సంవత్సరానికి పన్నెండు వేల చొప్పున నాలుగు సంవత్సరాల పాటు 48 వేల రూపాయలు స్కాలర్ షిప్ గా అందచేయబడతాయని వీరికి ట్రైనింగ్ ఇచ్చి ప్రోత్సహించిన ఆర్ ఎస్ ఆర్ సైన్స్ ఉపాధ్యాయుడు సతీష్ కుమార్ నేడొక ఒక ప్రకటన లో తెలియజేశారు. ఈ విద్యార్థులకు శిక్షణను ఇచ్చి ప్రోత్సహించిన పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడు సతీష్ కుమార్ కి ,రిసోర్స్ పర్సన్స్ శ్రీకాంత్, నారాయణ రెడ్డి లకు ప్రధానోపాధ్యాయుడు మధుసూధన్ బాబు ఇతర ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.
అలాగే అయిదు మంది విద్యార్థినీ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి పాఠశాల విద్యార్థి ఇటువంటి పోటీల్లో పాల్గొని విజేతగా నిలవడానికి ప్రయత్నం చేయాలని వారిని వారి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలని ఉపాద్యాయుడు సతీష్ కుమార్ పేర్కొన్నారు.