న్యాయవాది వృత్తిలో 20సంవత్సరాలు పూర్తిచేసుకున్న దాసరి -పలువురు అభినందనలు

 


State Politics News【Nellore】:

 న్యాయవాది వృత్తిలో ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొని పేదప్రజలకు ఉచిత న్యాయ సలహాలు, సేవలందించిన దాసరి రాజేంద్ర ప్రసాద్ విజయవంతంగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పలువురు అభినందనలు తెలిపారు. నెల్లూరు నగరంలో ఫత్తేఖాన్ పేట కు చెందిన దాసరి రాజేంద్ర ప్రసాద్ గత20సంవత్సరాలుగా న్యాయవాది వృత్తిలో కొనసాగుతూ..పలువురికి ఉచిత న్యాయ సలహాలు అందించి ,మరెంతో మందికి సహాయపడిన వ్యక్తిగా కొనసాగారని పలువురు కొనియాడారు. 



ఈ సందర్భంగా సోమవారం  ఫత్తేఖాన్ పేటలోని న్యాయవాది  దాసరి రాజేంద్ర  ప్రసాద్ కార్యాలయంలో పలువురు ఆయనని సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు   మిడతల రమేష్ ,జిల్లా బీజేపీ కార్యదర్శి యాకసిరి ఫణిరాజు,కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోటిరెడ్డి సుధాకర్ రెడ్డి, నీలగిరి సంఘం మండల బీజేపీ అధ్యక్షులు చిలక ప్రవీణ్ కుమార్,బీజేపీ జిల్లా నాయకులు మారుబోయిన శ్రీనివాసులు గౌడ్,న్యాయవాదులు పూనమల్లి రామకృష్ణ,మక్కెన అంకయ్య చౌదరి,నీలకంఠ ప్రసాద్,సురేష్ బాబు,మండల బీజేపీ నాయకులు అనురాధ, చక్రధర్,రాజశేఖర్, మాధవ్ ,పృథ్వి రాజ్ తదితరులు పాల్గొన్నారు.