కోవిడ్ పేషంట్లకు ధైర్యాన్ని నింపిన మంత్రి గౌతమ్ రెడ్డి

 


State politics news【Nellore】:

రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి  మేకపాటి గౌతం రెడ్డి నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ని శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలో ఆక్సిజన్ పొందుతున్న కోవిడ్ పేషెంట్స్ , వారి అటెండెన్స్ తో చర్చించి ధైర్యాన్ని కలుగజేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్యం, ఆహార వసతి  తదితరలను అడిగి తెలుసుకున్నారు

   


  

   అనంతరం జిల్లా కలెక్టర్  కెవిఎన్ చక్రధర బాబు తో కలిసి ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి కి50 ఆక్సిజన్ కాన్సన్ట్రేట్ లను అందించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఆసరా శ్రీ బాపిరెడ్డి ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.