State politics news【Nellore】:
కరోనా సెకండ్‌వేవ్‌లో కేసులు పెరిగిపోతుండడంతో జనాలకు గుబులు పట్టుకుంటోందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని , ధైర్యంగా ఉంటే మహమ్మారి బెడద నుంచి బయటపడొచ్చని ఏపీ లీగల్ కో కన్వీనర్ దాసరి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్ స్టాండ్, పూలే బొమ్మ, మినీ బైపాస్ రోడ్డులో పలు రోడ్డు మార్జిన్ వ్యాపారస్తులకు మాస్క్ లు పంపిణీ చేసి అవగహన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా రాకుండా జాగ్రత్తలు పాటించాలని, వచ్చినా ధైర్యంగా ఉండాలని, కరోనా వచ్చిందన్న భయంతో ఆసుపత్రికి పోనవసరం లేదన్నారు. ఇంట్లోనే 93 శాతం మంది కోలుకుంటున్నారని ధైర్యంగా ఉండాలని సూచించారు. పాజిటివ్ వచ్చినోళ్లందరికీ ఆక్సిజన్ అవసరం లేదని, ఆక్సిమీటర్‌లో 95 శాతం కన్నా తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే జాగ్రత్త పడాలని, ఎక్కువ రోజుల పాటు జ్వరం, దగ్గు, నీరసం ఉన్నప్పుడు మాత్రమే ఆసుపత్రిలో చేరాలని చెప్పారు.
మాస్కులు లేని వాళ్లకు మాస్కులు ఇచ్చి ,సోషల్ డిస్టెన్స్ పాటించాలని, ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలనీ, శానిటైజర్ లు తరచుగా వాడాలని, ప్రజలకి మైక్ ద్వారా చెప్పారు . ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు పులి రమేష్ ఉపాధ్యక్షులు మంచాల మహేంద్ర , నీలగిరి సంఘం మండలాధ్యక్షుడు చిలక ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.