State politics news【Nellore】:
పశ్చిమ బెంగాల్ లో బీజేపీ కార్యకర్తలు పై ,వారి ఆస్తులపై దాడి చేస్తూ..అడ్డుకున్న వారిని హత్య చేస్తున్న తృణమూల్ కాంగ్రెస్ గుండాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ మారణ కాండను ఆపాలని ఆంధ్రప్రదేశ్ బీజేపీ లీగల్ సెల్ కో కన్వీనర్ దాసరి రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు.నెల్లూరు లోని స్థానిక ఫత్తెఖాన్ పేట బీజేపీ ఆఫీసులో బుధవారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో రావడంతోనే బీజేపీ కార్యకర్తలు పై దాడులకు పాల్పడి వారిని హతమార్చిందని ఆ గూండాల పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జాతీయ బీజేపీ నాయకత్వం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో చిలకా ప్రవీణ్ కుమార్, యాకసిరి ఫణిరాజ్ లు పాల్గొన్నారు.