ఉపాధ్యాయునికి దాతృత్వం అందించిన బీజేపీ లీగల్ సెల్

 


State p


olitics news【Nellore】: 

 నెల్లూరు  జిల్లాలోని కోట గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేస్తున్న విజయమోహన్ అనే వ్యక్తికి కరోనా సోకి చెన్నైలో చికిత్స పొందుతున్నారు. అదే క్రమంలో దాదాపు 30 లక్షలు రూపాయలు ఇప్పటికి ఖర్చయింది. అంత మొత్తం భరించలేని ఆ కుటుంబానికి కొంత చేదోడుగా బీజేపీ నెల్లూరు జిల్లా లీగల్ సెల్ నిలిచింది. జిల్లా లీగల్ సెల్  కన్వీనర్ దాసరి ప్రసాద్,అతని వి ఆర్ కాలేజ్ స్నేహితులు నలుగురు కలిసి 50,000 రూపాయలు వారికి ఫోన్ పే ద్వారా నగదు పంపారు. ఈ సందర్భంగా జిల్లా లీగల్ సెల్ బృందానికి పలువురు బీజేపీ నేతలు  అభినందనలు తెలిపారు.