State politics news【Nellore rural】:
జలవనరుల శాఖ మంత్రి పి అనిల్ కుమార్, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గం స్థానిక నారాయణ వైద్యశాలలో సంబంధిత వైద్యులు , అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మేకపాటి గౌతం రెడ్డి మాట్లాడుతూ.. ఆస్పత్రిలో బెడ్ ల వివరాలు, ఐ సి యూ బెడ్లు, ఆక్సిజన్ అందుబాటు తదితర విషయములను నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్ ని అడిగి తెలుసుకున్నారు. సంబంధిత డాక్టర్లతో చర్చిస్తూ ఆరోగ్యశ్రీ మరియు ఆరోగ్యశ్రీ లేనివారికి అందిస్తున్న వైద్య వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పి అనిల్ కుమార్ మాట్లాడుతూ సామాజిక మాధ్యమాలలో ప్రైవేటు ఆసుపత్రి లలో వేస్తున్న బిల్లులపై పలు అపోహలు ఉన్నాయన్నారు. కాబట్టి బిల్లుల విషయంలో పారదర్శకత గా అవసరమైన మేర మాత్రమే బిల్లు ఉండేలా అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. రేట్ల విషయంలో కూడా తారతమ్యం లేకుండా ఉండేలా చూసుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. వి. ఎన్. చక్రధర బాబు, ఆసుపత్రి యాజమాన్యం తరపున విజయ భాస్కర్ , డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.