ప్రచార ఆర్భాటాలకే వైసీపీ ప్రభుత్వం:బీజేపీ నేత రాజేంద్ర

 


State politics news【Nellore】:

 ప్రధాని మోడీ జీ నేరుగా రైతులకు అందిస్తున్న ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి మూడు వేల 30 కోట్ల రూపాయలును నేరుగా రైతులు ఖాతా జమచేసారని బిజెపి రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. 


              నగరంలోని ఫత్తేఖాన్ పేట, రావి చెట్టు సెంటర్ బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రైతు భరోసా పేరుతో స్టిక్కర్ వైసీపీప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకు ప్రాధాన్యత ఇస్తోందని , రైతులు ధరలు లేక ఇబ్బందులు పడుతుంటే మిల్లర్ల దోపిడీని అరికట్టలేని అసమర్థ ప్రభుత్వం అని  విమర్శించారు. రైతులు పండించిన పూర్తి ధాన్యం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు .పీఎం కిసాన్ నిధి ని రైతు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని కరోనా సమయంలో కూడా రైతులను మోడీ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.బీజేపీ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని వైసీపీ ప్రభుత్వం మాత్రం ప్రచార ఆర్భాటాలే ధ్యేయంగా కోట్ల రుపాయలని అనవసరంగా ఖర్చు చేస్తూ..రైతులను మోసగిస్తుందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో నీలగిరి సంఘం మండల అధ్యక్షుడు చిలక ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి రవి,ఉపాధ్యక్షుడు మధుసూదన్,రమణ తదితరులు పాల్గొన్నారు.