State politics news 【Nellore】:
నెల్లూరు నగరంలోని 35వ డివిజన్ పొదలకూరు రోడ్డు లో ప్రగతి నగర్ నందు గురువారం బీజేపీ రాష్ట్ర లీగల్ సెల్ కో కన్వీనర్ దాసరి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో కషాయ వితరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత ,స్వీయ నియంత్రణ సామాజిక దూరం పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటే కరోన దరిచేరదన్నారు. ఈ ఆయుర్వేద కషాయం తాగడం వలన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని తద్వారా కరోనా ని ఎదుర్కొనే శక్తి ఉంటుందన్నారు. ఈ ఆయుర్వేద కాషాయ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నెల్లూరు జిల్లా అధ్యక్షులు గుండ్లపల్లి భరత్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు రమేష్ , జిల్లా కార్యదర్శి యకసిరి ఫణిరాజు , నీలగిరి సంగం మండల అధ్యక్షులు చిలక ప్రవీణ్ కుమార్ , ప్రధాన కార్యదర్శి రవి , ఉపాధ్యక్షులు మధుసూదన్ ,రమణ తదితరులు పాల్గొన్నారు.