ప్రభుత్వ వైఫల్యమే కోవిడ్ పేషంట్లకు ఆక్సిజన్ కొరత:బీజేపీ నేత దాసరి

 


State politics news【Nellore】:

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యం వలన కోవిడ్ పేషంట్లకు ఆక్సిజన్ కొరత ఏర్పడి చనిపోయారని బీజేపీ రాష్ట్ర లీగల్ సెల్ కో కన్వీనర్ దాసరి రాజేంద్ర ప్రసాద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ.. నిరసన కార్యక్రమం చేపట్టారు. 



      రాష్ట్ర బీజేపీ అధిష్టానం పిలుపు మేరకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. నెల్లూరు నగరంలో ని పత్తేఖాన్ పేట బీజేపీ కార్యాలయంలో బీజేపీ నేత దాసరి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో వైసీపీ కి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేశారు. 

       ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వైసీపీ నిర్లక్ష్యం వలన కోవిడ్ బాధితులు మరణిస్తున్నారని..మరల అలాంటివి సంభవించకుండా నెల్లూరు జిల్లాలో 46మండలాల కేంద్రంలో కోవిడ్ ఆసుపత్రిలో ఆక్సిజన్,తదితర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఎక్కువమంది కోవిడ్ బాధితులు తాకిడి వలన మరణాలు కూడా అధికమవుతాయన్నారు. అధికారులు, పాలకులు మండలాల వారీగా కోవిడ్ బాధితులకు సరైన వైద్య సేవలు అందిస్తే జిల్లాలో మరణాలు తగ్గుతాయన్నారు.ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా కార్యదర్శి ఫణి రాజు ,నెల్లూరు రూరల్ మండల అధ్యక్షుడు చిలక ప్రవీణ్ కుమార్ ,సాయి తదితరులు పాల్గొన్నారు.