★డూప్ సమీక్షల కోసం వెళ్లి మంత్రి కరోనా తెచ్చుకున్నాడు
★టిడిపి నేత చావుబతుకుల్లో ఉంటే నాడు వెళ్లా
★ ప్రజలు అల్లాడుతుంటే ఇద్దరు మంత్రులు ఏమయ్యారు.
State politics news【Nellore】:
రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ లాగా డ్రామాలు వేయడం తమకు చేత కాదని టిడిపి నెల్లూరు నగరం నియోజకవర్గ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు నగరంలోని కోటం రెడ్డి నివాసంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు .
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టిడిపి నేత పడవల కృష్ణమూర్తి చావుబతుకుల్లో ఉండి బెడ్ కూడా దొరకని పరిస్థితుల్లో తాను స్వయంగా నెల్లూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి వెళ్లి అతనిని చేర్పించానన్నారు. దీనిని రాజకీయ కోణంలో మంత్రి అనిల్ దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఫోటోలు కోసం తాను వెళ్లి కరోనా బారిన పడినట్టు విమర్శించారన్నారు. అదే మంత్రి అనిల్ డూప్ సమీక్షల కోసం మీడియాకు ముందుగానే సమాచారం ఇచ్చి వెళ్లి కరోనా తెచ్చుకున్నాడన్నారు. మంత్రి అనిల్ లాంటి నటుడు మరొకరు ఉండరని ఎద్దేవా చేశారు.
నెల్లూరు జిల్లాలో కరోనా బీభత్సం అధికంగా ఉందని పేదవాడికి బెడ్లు దొరక్క ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఓవైపు అల్లాడి పోతుంటే ఇద్దరు మంత్రులు ఏమయ్యారని ఎక్కడికి వెళ్లారని ఆయన ప్రశ్నించారు. ప్రజల కష్టాల్లో ఉంటే ఇద్దరు మంత్రులు బయటకు మాత్రం రారని చంద్రబాబు, లోకేష్ ను విమర్శించేందుకు మాత్రం ఇద్దరు మంత్రులు పోటీల మీద మాత్రం వస్తారని మండిపడ్డారు. కరోనా నివారణ చర్యలు చేపట్టడంలో వైఫల్యం చెందిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.