ప్లాస్మా దానం చేసిన బీజేపీ లీగల్ సెల్ దాసరి

 


State politics news【Nellore】:

కరోనా తో బాధ పడేవారికి బాసట గా నిలుస్తూ వారికి భరోసా ప్రతి ఒక్కరు కల్పించాలని బీజేపీ రాష్ట్ర లీగల్ సెల్ కో కన్వీనర్ దాసరి రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని మద్రాస్ బస్ స్టాండ్ వద్ద రెడ్ క్రాస్ లో ఆయన ప్లాస్మా దానం చేశారు.



     ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కరోన బారిన పడి త్వరగా కోలుకునేందుకు ఉపయోగ పడుతుందని, ప్రతి ఒక్కరు ప్లాస్మా దానం చేయాలన్నారు. కరోన నుండి కోలుకున్న వారు కూడా ప్లాస్మా దానం చేసి మరో ఇద్దరికి ప్రాణ దానం చేసిన వారవుతారన్నారు.ప్రతి ఒక్కరు ప్లాస్మా దానం చేయడం వలన కరోన బారిన పడిన వారు త్వరగా కోలుకుని కరోన కి చెక్ పెట్టవచ్చని తెలిపారు.అనంతరం రెడ్ క్రాస్ ఛైర్మన్ దాసరిను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్లాస్మా మోటివేటర్ బయ్యా వాసు,డాక్టర్లు,రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.