డివిజన్ ప్రజల ఆరోగ్యమే తమ కర్తవ్యం-కిన్నెర మాల్యాద్రి

 

State politics news【Nellore】:

 రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనీల్ కుమార్ అదేశాలు మేరకు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు రూప్ కుమార్, నెల్లూరు నగర కార్పొరేషన్ మాజీ డిప్యూటీ  మేయర్ ముక్కాల ద్వారకానాధ్ ల సహాయ సహకారాలతో 7వ డివిజన్ వైసీపీ  ఇంఛార్జ్ కిన్నెర మాల్యాద్రి ఆధ్వర్యంలో ప్రజలకు కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని 7వడివిజన్ లక్ష్మీపురంలో శుక్రవారం వైకాపా కార్యాలయంలో 45 సంవత్సరాలు పై బడిన వారికి మూడోవ సారి మొదట డోస్ కోవిడ్ వ్యాక్సిన్ వేశారు.ఈ సందర్భంగా డివిజన్ ఇంఛార్జ్ కిన్నెర మాల్యాద్రి మాట్లాడుతూ...డివిజన్ ప్రజల ఆరోగ్య రక్షణే తమ కర్తవ్య బాధ్యతని,డివిజన్ కూడా అభివృద్ధి చెందుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో యువనేత కిన్నెర సాగర్, వైకాపా



నాయకులు రవి, వేణు,కార్యకర్తలు అశోక్ అవినాష్ తదితరులు పాల్గొన్నారు.