State politics news【Nellore】:
నెల్లూరు జిల్లా బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ గా దాసరి ప్రసాద్ గౌడ్ ని జిల్లా బీజేపీ అధ్యక్షుడు భరత్ కుమార్ యాదవ్ నియమించినట్లు జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ముక్కు రాధా కృష్ణ గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
గతంలో ప్రసాద్ గౌడ్ ఏబీవీపీ అధ్యక్షుడు గా, నగర కార్యదర్శి గా,బీజేవైయం జిల్లా ప్రధాన కార్యదర్శి గా,జిల్లా ఉపాధ్యక్షుడు గా పలు కీలక పదవుల్లో పనిచేశారని తెలిపారు. జిల్లాలో న్యాయవాదులను బీజేపీ లో చేర్పించేలా ప్రసాద్ గౌడ్ కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ కోరారు.అలాగే జిల్లా బీజేపీ నేతలకు న్యాయ పరమైన సమస్యలను దగ్గరుండి చూసుకోవాలన్నారు.ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచి ఈ పదవిని ఇచ్చిన జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ కు జిల్లా బీజేపీ అగ్రనేతలకు కృతజ్ఞతలు ను దాసరి ప్రసాద్ గౌడ్ తెలిపారు.