డివిజన్ ప్రజల ఆరోగ్యమే తమకర్తవ్య బాధ్యత-కిన్నెర మాల్యాద్రి

 


State politics news【Nellore】:

 జలవనరుల శాఖ మంత్రి పి అనిల్ కుమార్ యాదవ్  ఆదేశాల మేరకు యువజన విభాగం అధ్యక్షులు  రూప్ కుమార్ యాదవ్ , మాజీ డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ లు  సహాయ సహకారాలతో 7వ డివిజన్ వైఎస్సార్సీపీ ఇంఛార్జి  కిన్నెర మాల్యాద్రి ఆధ్వర్యంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంనిర్వహించారు.



           నగరంలోని 7వ డివిజన్ వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయం శనివారం 45 సంవత్సరాలు పైబడిన వారికి ఉచితంగా ప్రభుత్వ సహకారంతో కోవిడ్ వాక్సిన్ వేయడం జరిగిందని డివిజన్ ఇంఛార్జ్ మాల్యాద్రి తెలిపారు. గత నెలలో వరుసగా కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం డివిజన్ ప్రజల కోసం నిర్వహించామని తెలిపారు.కరోనా వైరస్ డివిజన్ నుండి పారదోలేందుకు తమ వంతుగా కృషి చేస్తామని, ప్రజల ఆరోగ్యమే తమ కర్తవ్య బాధ్యతని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో యువనేత కిన్నెర సాగర్,వైసీపీ నేతలు మర్రెడ్డి వేణుగోపాల్ రెడ్డి,డి ప్రభాకర్ కార్యకర్తలు, అశోక్,అవినాష్ పప్పు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.