ఘనంగా గౌతు లచ్చన్న వర్దంతి

 



State politics news【Nellore】:

 బీసీల ఆరాధ్య దైవం బిసి సంఘం వ్యవస్థాపక నాయకులు సర్దార్ గౌతు లచ్చన్న15వ వర్దంతిని నెల్లూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సోమవారం నగరంలోని  కిసాన్ నగర్ లో బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం వద్ద బీసీల సింహం సర్దార్ గౌతు లచ్చన్న చిత్ర పటానికి పూలమాల వేసి బీసీ నేతలు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా మహిళ అధ్యక్షురాలు కొమారి విజయమ్మ మాట్లాడుతూ... బీసీల కోసం పోరాడి  వారికి చట్ట సభల్లో రిజర్వేషన్లు కలిపించిన మహోన్నత వ్యక్తి గౌతు లచ్చన్నే అని ఆమె అన్నారు.ఆయనకు నివాళులు అర్పించడం ఆయన చిత్ర పటానికి పూలమాల వేయడం తమ అదృష్టంగా భావిస్తామన్నారు. జిల్లా ప్రచార కార్యదర్శి వెంపులూరు మల్లికార్జున్ గౌడ్  మాట్లాడుతూ.. వెనుక బడిన తరగతులకు బాసటగా నిలిచి వారి అభ్యున్నతికి దోహదపడిన  మహాత్ముడన్నారు.ప్రస్తుతం స్థానిక సంస్థలు, మునిసిపల్ ఎన్నికలలో బీసీలు అధికంగా కనిపిస్తున్నారంటే గౌతు లచ్చన్న ఆనాడు పోరాట ఫలితమే బీసీ లకు చట్టసభల్లో 30శాతం రిజర్వేషన్లు కలిపించారని తెలిపారు. ఈ మహానీయుణ్ణి స్మరించుకోవడం బీసీలకు ఒక గర్వకారణం, అదృష్టం అని అన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ రాష్ట్ర నాయకులు నాసిన భాస్కర్ గౌడ్ జిల్లా కార్యదర్శి కొమారి వేణు గోపాల్, మహిళ కార్యదర్శి సత్యవతి,మహిళ బీసీ నేతలు సునంద, నాజుని, రమాదేవి, వెంకటరమణమ్మ,రాజేశ్వరి, విజయ,సుబ్బరత్నమ్మ,శీనయ్య తదితరులు పాల్గొన్నారు.