State politics news【Nellore】:
ప్రజల సహకారం ఉంటేనే నగరాభివృద్ది చెందుతుందని అభివృద్ధి లో భాగంగా డివిజన్ లో సర్వేపల్లి కాలువ పై నివసించే ప్రజలకు మాజీ డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాధ్ భరోసానిచ్చారు. నగరంలోని స్థానిక ఆరో డివిజన్లో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వారి ఆదేశాల మేరకు వుడ్హౌస్ సంఘం ,మూల సాయిబు వీధి తదితర ప్రాంతాలలో మాజీ డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ శుక్రవారం పర్యటించారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సర్వేపల్లి కాలువ ఆధునీకరణలో భాగంగా రివిట్ మెంట్ వాల్ నిర్మాణం కొరకు పర్యవేక్షించారు. ప్రజలందరూ సహకరిస్తే త్వరలోనే పనులన్నీ పూర్తవుతాయన్నారు.కాలువ అంచున నివసిస్తున్న ప్రజలు ఇల్లులు ఖాళీ చేయాలని,పనులు పూర్తయన తరువాత మరల అదే ప్రాంతంలో నివసించేందుకు అవకాశం కల్పిస్తామని ప్రజలకు ముక్కాల భరోసా ఇచ్చారు. మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి నెల్లూరు నగర అభివృద్ధి పరుగులు తీస్తోందన్నారు. సీఎం జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు.త్వరలో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు వైసీపీ అభ్యర్థిని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ వైకాపా ఇంచార్జ్ మద్దినేని శ్రీధర్, వైకాపా నేతలు ,కార్యకర్తలు అడపా శ్రీధర్, గురు కిషోర్, కాలేష,రమేష్ తదితరులు పాల్గొన్నారు.