State politics news【Nellore】:
అఖిల భారత సాధుచెట్టి సేవా సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు గా కాయం గోవింద్ రాజులు ప్రమాణ స్వీకారం చేశారు.నగరంలోని నవాబుపేట్ రైతుబజార్ సాధుచెట్టి జిల్లా కార్యాలయం వద్ద ఆదివారం అంగరంగ వైభవంగా కాయం గోవింద్ రాజులు జిల్లా అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేసి పదవి బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లాలో సాధుచెట్టి కులం రాజకీయంగా, ఆర్ధికంగా వెనకబడి ఉందని కులాభివృద్ధికి పాటుపడతానని నూతన అధ్యక్షుడు కాయం గోవింద రాజులు తెలిపారు.
అలాగే కుల దైవం కామాక్షమ్మ దేవాలయంని జిల్లాలో నిర్మిస్తామని,కుల సంఘీయులుకు ఆరోగ్య రీత్యా ప్రభుత్వ సహకారంతో మెరుగైన వైద్య సదుపాయాలు అందిస్తామని ఈ సందర్భంగా ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో సాధుచెట్టి అఖిల భారత సేవా సంఘం నెల్లూరు జిల్లా గౌరవ అధ్యక్షుడు రాళ్ళ గజేంద్ర బాబు,బీమాకొండ చిన్నయ్య చెట్టి,చింతాల కేశవులుచెట్టి, ఉపాధ్యక్షుడు కాయం లోకయ్య చెట్టి, సెక్రటరీ వొమ్మి శివాజీ చెట్టి,సహాయ కార్యదర్శి కక్కు శ్రీనివాసులు చెట్టి,కోశాధికారి తిమ్మిరి దాము చెట్టి,గౌరవ సలహా దారులు కోటా రామకృష్ణ చెట్టి ,దొళ్ళు దుర్గప్రసాద్, కోటా దాము,ముమ్ముడి త్యాగ రాజన్ తదితరులు పాల్గొన్నారు.