ప్రజా ఆరోగ్యమే నా బాధ్యత-డివిజన్ ఇంఛార్జ్ గణేశం

 


State politics news【Nellore】:

 ప్రజా ఆరోగ్యమే తమ బాధ్యతని 15వ డివిజన్ వైసీపీ ఇంఛార్జ్ గణేశం వెంకటేశ్వర రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆదేశాలు మేరకు శనివారం  నగరంలోని 15వ డివిజన్ బాలాజీ నగర్ అన్నపూర్ణ అపార్ట్మెంట్, మసీదు సెంటర్ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు . ఆ పరిసర ప్రాంతాల్లో అపరిశుభ్రతను శానిటేషన్ సిబ్బంది చే తొలిగింపచేశారు.అలాగే కోవిడ్ ని డివిజన్ లో అరికట్టేందుకు స్ప్రే చేయించారు.



ప్రజలకు మాస్క్ లు,సామాజిక దూరం పాటించాలని ఆయన సూచించారు. డివిజన్ అభివృద్ధి, ఆరోగ్యమే తన లక్ష్యమని, మంత్రి అనిల్ కుమార్ సహకారమే 15వ డివిజన్ లో అభివృద్ధి పనులు వేగవంతమవుతున్నాయన్నారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట స్థానిక సచివాలయం సెక్రటరీలు,సిబ్బంది పాల్గొన్నారు.