మంత్రి మేకపాటి నెల్లూరు పేషీలో డీఈవో వాసు మృతి చెందడంపై దిగ్భ్రాంతి.

 


State politics news 【Hydrabad,Nellore】:

నిన్నటి వరకు బాగున్న వాసు ఇప్పుడు లేరన్న వార్త కలచివేసింది: మంత్రి మేకపాటి

★వాసు కుటుంబానికి ప్రగాఢ సంతాపం

★వాసు కుటుంబాన్ని నా కుటుంబంలా చూసుకుంటా: మంత్రి

(హైదరాబాద్, నెల్లూరు): జిల్లా మంత్రి మేకపాటి క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ (డీ.ఈ.వో)గా విధులు నిర్వహించే వాసు(46) మృతి  చెందడంపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరోనాపై పోరాటంలో నిన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్న వాసు ఇవాళ మనమధ్య లేరన్న విషయం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. నెల్లూరు జిల్లా జీజీహెచ్లో వైద్యం పొందుతున్న వాసుకి రెమిడిసివర్ ఇంజెక్షన్ల వంటి అత్యవసర వసతులు సమకూర్చినా కాపాడుకోలేకపోయామని  మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వాసు కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని అని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. వాసు ఇద్దరు కుమార్తెలను చదివించి, ఉద్యోగాలు కల్పించే బాధ్యత తాను తీసుకుంటానని తెలిపారు. పేషీ కుటుంబంలో మనిషిగా ఏ విధమైన సహకారమైనా అందించి వాసు కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ఎవరు కరోనా విషయంలో అశ్రద్ధ వహించకుండా మరింత జాగ్రత్తగా ఉండాలని మంత్రి కోరారు. ప్రతి ఒక్కరు జాగరూకతతో ఉన్నప్పుడే మన కుటుంబం, సమాజం బావుంటుందని మంత్రి తెలిపారు.