State politics news【SARVEPALLI】:
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లాలో కరోనా నియంత్రణకు పూర్తిస్ధాయిలో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ని జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ని వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి మంగళవారం ప్రకటనలో కోరారు. జిల్లాలోని ప్రభుత్వాసుపత్రులతో పాటు, ప్రభుత్వం అనుమతించిన కోవిడ్ చికిత్స అందిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా సోకిన వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు, అనుమతించిన ఆసుపత్రులలో కూడా పడకలు, ఆక్సిజన్లు, *"రెండిసివిర్ ఇంజక్షన్లు"* అందుబాటులో ఉంచి, అవసరమైన చికిత్స అందించడంతో పాటు, తగిన నివారణ చర్యలు చేపట్టాలన్నారు. కరోనా సోకిన వారికి పూర్తిస్థాయిలో వైద్య సదుపాయాలు కల్పించడంతో పాటు, పౌష్టికాహారం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై ప్రజలందరూ పూర్తిగా సహకరించి, కరోనా నియంత్రణ చర్యలను పాటించాలని కోరారు.