State politics news【Nellore】:
నెల్లూరు జిల్లాకు ఐఏఎస్ స్టడీ సర్కిల్ మంజూరై ఐదు సంవత్సరాలు గడిచినా ఇప్పటివరకు కార్యక్రమాలు జరగకుండా పోవడం అన్యాయమని ఏపీ దళిత సేన రాష్ట్ర కార్యదర్శి అరవ పూర్ణ ప్రకాష్ కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. గురువారం నెల్లూరు నగరంలోని అంబేద్కర్ భవన్ వద్ద ఏపీ దళిత విద్యార్థి సేన, దళిత సేన ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నెల్లూరు జిల్లాలోని ఎస్సీ ,ఎస్ టి, బిసి నిరుద్యోగులకు ఎంతో ఉపాధి కలిగించే గ్రూప్ 1,గ్రూప్ 2, గ్రూప్ 4 జేఎల్ కోచింగ్ లకు ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగు సంవత్సరాలుగా నాలుగు కోట్ల 75 లక్షలు నిధులు మంజూరు కాగా తూతూమంత్రంగా పనులు జరగడం అన్యాయమని అన్నారు. కనీసం ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ఐఏఎస్ స్టడీ సర్కిల్ పనులు త్వరగా జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ నెల 14వ తేదీన అంబేద్కర్ 130వ జయంతి పురస్కరించుకుని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో హాస్టళ్లలో తప్పక నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ కె బాబు,ఇ. వెంకట రమణయ్య, దగదర్తి వెంకట్, వేణు ,రవికుమార్, ధర్మయ్య, శ్రీనివాసులు, రవి, షేక్ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.