ఆర్యవైశ్యల్లో ఒక్కమగాడు "ముక్కాల ద్వారకానాధ్"

 



State politics news【Nellore】:

  ఆర్యవైశ్యల ఆశాజ్యోతిగా ఇపుడు ముక్కాల ద్వారకానాధ్ వైశ్యుల్లో వెలుగొందుతున్నారు.చెప్పిన మాట చేసే పనితీరే ముక్కాల నైజం. సున్నితమైన మనస్సు ప్రతి ఒక్కరినీ చిరునవ్వుతో పలుకరించడం ద్వారకానాధ్ కున్న అభినయం.

             వరుసగా నెల్లూరులో ఆర్యవైశ్యలకు అండగా ఉంటూ...నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ వరకు మాత్రం నెల్లూరు లో వైశ్యులు రాజకీయంగా ఎదిగారు. కానీ ముక్కాల ద్వారకానాధ్ అనే వ్యక్తి కాదు ఒక శక్తి గా వైశ్యుల్లో ఒక వజ్రంగా మారి నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ స్థాయి కి ఎదిగారు. తరువాత ఆర్యవైశ్య అర్బన్ అధ్యక్షుడుగా  ఉంటూ..నెల్లూరు నగరంలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం పునః నిర్మాణం అత్యంత వైభవంగా వైశ్యులుకు చెప్పిన విధంగానే చేసి చూపారు ఆయన వర్గం.అప్పట్లోనే వైశ్యుల్లో ముక్కాల అనే వ్యక్తి వ్యక్తి కాదు శక్తిగా ముద్ర పడ్డారు. తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడుగా  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.వరుసగా విజయాల పరంపరలో ముందుకు సాగుతూ...ఆర్యవైశ్యలుకు ఆర్తినితీర్చే శ్రీపాండురంగ అన్నదాన సమాజం ఎన్నికల్లో కూడా తన ప్రత్యర్థి వర్గంకు డిపాజిట్లు కూడా లేకుండా ముక్కాల ద్వారకానాధ్ వర్గం శ్రీ వాసవీ మాత ప్యానల్ అందరు విజయ ఢంకా మ్రోగించి ముక్కాల వర్గం కు ఇక తిరుగులేదు..ఎదురులేదు.. ఎదురునిలబడేవారెవ్వరు..అనేలా గతంలో ఎన్నడూ లేని విధంగా విజయం సాధించడం అది ఒక్క ముక్కాల ద్వారకానాధ్ ఒక్కరినే చూసే ఓటింగ్ వార్ వన్ సైడుగా వేశారు వైశ్యలు.అందుకే ముక్కాల వెనకే ఆర్యవైశ్యలనే పాండురంగ అన్నదాన సమాజ ఎన్నికలే నిదర్సనమ్ గా తేట తెల్లమవుతూ స్పష్టం అవింది.

           ఒక సామాన్య  వ్యాపారవేత్త ఆయనకున్ననైజం  చిరునవ్వే  ఆయుధంగా అందరితో స్నేహశీలి గా ఉంటూ..ఎంత ఎదిగిన ఒదిగిఉండడంతో ఆయన కొద్దికాలంలోనే వైశ్యుల్లో "ఒక్కమగాడు"గా ఎదిగారు.ఎవరి నోట విన్న ముక్కాల ఉంటే ఆ తీరే వేరు...ఆయనున్న ఏ సమావేశం అయిన ఆసక్తిగా అంతిమంగా వైశ్యుల అభివృద్ధికే శ్రీకారం చుట్టే విధంగా ఆయన అడుగులు ఉంటున్నాయి.

           వైశ్యులకు ఏ సమస్య వచ్చినా తానున్నాననే భావన వైశ్యుల్లో కలిగే విధంగా ముక్కాల ద్వారకానాధ్ పని తీరే చెబుతోంది. దీనితో వైశ్యుల్లో వైషమ్యాలు లేకుండా అందరూ కలిసి కట్టుగా ఒక వేదికగా వైశ్య అభివృద్ధికి పాటు పడేలా ముక్కాల కృషే నిదర్సనం. అందుకే ఏ వైశ్యుల నోట విన్న ముక్కాల ద్వారకానాధ్ వైశ్యుల్లో ఒక్కమగాడే అని వినపడుతోంది.