ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకొచ్చా-కిన్నెర మాల్యాద్రి

 


State politics news【Nellore】:

ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకొచ్చానని మాటలు చెప్పే వాడిని కాను చేతల్లో చేసి ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని 7వ డివిజన్ వైసీపీ అభ్యర్థి కిన్నెర మాల్యాద్రి పేర్కొన్నారు.

నగరంలోని స్థానిక ఏడో డివిజన్లో  మంత్రి అనిల్ కుమార్ యాదవ్, వైకాపా నేత రూప్ కుమార్ యాదవ్ వారి ఆదేశాల మేరకు నెల్లూరు నగర మునిసిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాధ్ సహకారంతో
డివిజన్ వైకాపా ఇంచార్జ్ కిన్నెర మాల్యాద్రి శుక్రవారం వెంగమాంబ ఆలయంలో పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. 



          ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగనన్న పాలనపై ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని ,సంక్షేమ పథకాలు పేద ప్రజల్లో, మహిళల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి పోతాయన్నారు.ప్రజలకు సేవ చేయడానికి  రాజకీయాల్లోకి తాను వచ్చానని ,చిరస్థాయిగా నిలిచిపోయే మంచి పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ ఏ ఆపద వచ్చినా వారికి అండగా ఉంటానని తెలిపారు.మంత్రి అనిల్ కుమార్ యాదవ్, రూప్ కుమార్ యాదవ్ ,డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాధ్ లు నా మీద నమ్మకం ఉంచి నన్ను నిలబెట్టినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. ప్రజలందరూ కూడా తనని ఆశీర్వదించాలని ఆయన కోరారు. అనంతరం డివిజన్ లో ఇంటి ఇంటికి వెళ్లి ప్రజలను పలకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కాకర్ల గురవయ్య నాయుడు, జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ సెక్రెటరీ పప్పు నారాయణ మర్రిరెడ్డి వేణు గోపాల్ రెెడ్్డి, యువనేత కిన్నెర సాగర్ ,వైకాపా కార్యకర్తలు అశోక్ ,అవినాష్, తోట వెంకటేశ్వర్లు,చావ రవి,పురుషోత్తం,రంగారావు తదితరులు పాల్గొన్నారు.