జగన్ సంక్షేమ పథకాలే ..గురుమూర్తి భారీ మెజారిటీతో గెలుపు:రాష్ట్ర గౌడ్ కార్పొరేషన్ ఛైర్మన్ మాదు శివరాం

 


State politics news[Nellore]:

 ప్రజా సంక్షేమమే జగన్ కి శ్రీరామ రక్ష అని తిరుపతి ఉపఎన్నిక లో భారీ మెజారిటీతో ఒక సామాన్యుడు డాక్టర్ గురుమూర్తి గెలుస్తారని రాష్ట్ర గౌడ్ కార్పొరేషన్ ఛైర్మన్ మాదు శివ రామకృష్ణ గౌడ్ తెలిపారు.నగరంలోని హోటల్ హరిత ఏపీ టూరిజం లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వరుసగా రాష్ట్రంలో వన్ సైడ్ గా ప్రజలు తీర్పు ఇచ్చారని అది సీఎం జగన్ చేస్తున్న సంక్షేమమే భారత దేశంలో ఎక్కడా లేదని అన్నారు.బీసీ,యస్సి, యస్ టీ, మైనారిటీ లకు న్యాయం చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి కే దక్కిందన్నారు.

తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీనా..లేక పార్లమెంట్ పార్టీనా  నారా చంద్రబాబు నాయుడే చెప్పాలని రాష్ట్ర దేవాంగ కార్పొరేషన్ డైరెక్టర్ బీరక సురేంద్ర సూటి ప్రశ్న సంధించారు.  రాష్ట్రములో టీడీపీ ఉనికి కోల్పోయిందని అందుకనే స్థానిక సంస్థలు జడ్పీటీసి, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు భయపడిందన్నారు.ఒక ప్రాంతీయ పార్టీ పార్లమెంట్ పార్టీగా మారిపోయి... తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తుందని అన్నారు. సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలను అభివృద్ధి పథంలో కి తీసుకెళుతుందని తెలిపారు.  ఈ సమావేశంలో రాష్ట్ర గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ నాయుడు రాంప్రసాద్ గౌడ్,మాజీ సెంట్రల్ బ్యాంక్ ఛైర్మన్ బుర్రా వెంకటేశ్వర్లు గౌడ్,బీసీ ల సమాఖ్య రాష్ట్ర నాయకులు ఉదయగిరి నరసింహులు గౌడ్,కావలి ఏయంసి ఛైర్మన్ తుళ్లూరు శ్రీనివాసులు గౌడ్ ,బీసీ ప్రచార కార్యదర్శి వెంపులూరు మల్లికార్జున్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.