కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న సీఎం జగన్ దంపతులు

 



State politics news【Guntur】:

 ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. గుంటూరు అమరావతి రోడ్డులోని భారత్ పేట 140వ వార్డు సచివాలయంలో సీఎం జగన్, సతీమణి భారతిలు పేర్లు నమోదు చేయించుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆ తర్వాత నిబంధనల ప్రకారం. వైద్యుల పర్యవేక్షణలో అరగంటపాటు అక్కడే  ఉన్నారు . అక్కడ సచివాలయం, వైద్య సిబ్బందితో ముఖ్యమంత్రి సమావేశమమయ్యారు. అలాగే వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు.

45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని సీఎం కోరారు. 4 నుంచి 6 వారాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. అలాగే వీలైనంత త్వరగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎస్ఈసీని కోరారు ఎన్నికల కమిషనర్ సీఎస్, డీజీపీ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశమై రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నానన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలను యూనిట్లుగా విభజించి ఈ వ్యాక్సినేషన్ ను పూర్తి చేయాలని సూచించారు.