State politics news【Nellore】:
పిల్లలు వివిధ రకాల పుస్తకాలను చదివి విజ్ఞానవంతులయ్యేందుకు ఉపయోగ పడుతుందని పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.మురళీమోహన్ రాజు పేర్కొన్నారు. రామిశెట్టి వెంకట సుబ్బారావు చారిటబుల్ ట్రస్ట్ మరియు పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం నెల్లూరు తిప్పారాజు వారివీధి కె.వి.ఆర్.నగరపాలక ప్రాధమిక పాఠశాల నందు అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలలో పుస్తక పాఠనాశక్తిని పెంచేందుకు, పుస్తక ప్రచురణ కర్తలు పిల్లల పుస్తకాలను ప్రచురించాలని, ప్రచారాలు చేస్తారని వివరించారు. నెహ్రూ యువ కేంద్ర జిల్లా అధికారి ఆకుల మహేంద్ర రెడ్డి మాట్లాడుతూ ఏండర్సన్ అనే బాలసాహితీవేత్త జ్ఞాపకార్ధం ఆయన పుట్టిన రోజున అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం ఏర్పాటు చేశారని తెలిపారు.అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు కె.సుమన, పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు టి.వెంకటేశ్వర్లు, మెతుకు రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.