State politics news【Guntur】:
పేద బడుగు,బలహీన వర్గాల విద్యార్థుల యొక్క ఉన్నత విద్యకు ఈ జీఓ వలన విఘాతం కలుగుతుందని తక్షణమే ఈ జీవోను రద్దు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షులు కుమ్మర క్రాంతి కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.
గురువారం గుంటూరు లోని ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎయిడెడ్, అన్ఎయిడెడ్ కాలేజీలో 2021 విద్యా సంవత్సరం నుండి పోస్ట్గ్రాడ్యుయేషన్ విద్యార్థులు జగనన్న వసతి దీవెన , జగనన్న విద్యా దీవెన పథకం యొక్క ముఖ్య సారాంశం సుమారు లక్షకు పైగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ దూరమయ్యే పరిస్థితి ఉందన్నారు. కాబట్టి ఈ జీవోను వెనక్కి తీసుకొని బడుగు,బలహీన వర్గాల ఉన్నత విద్య చేకూరే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే జీవో ని వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం సాగుతుందని ఆయన తెలిపారు.