7వ డివిజన్ లో 500మందికి పైగా కో వ్యాక్సినేషన్ కార్యక్రమం



State politics news【Nellore】:

 ఏపీ స్టేట్ ఇరిగేషన్ మినిస్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ ఆదేశానుసారం 7వ డివిజన్ వైసీపీ ఇంచార్జ్ కిన్నెర మాల్యాద్రి ఆధ్వర్యంలో కోవిడ్ నివారణ కో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని 7వడివిజన్ లక్ష్మీపురంలో డివిజన్ వైకాపా కార్యాలయంలో బుధవారం సుమారు 500మందికి కో వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టారు.డివిజన్ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని కోవిడ్ మహమ్మారిని డివిజన్ నుండి తరిమేస్తామని ఇంచార్జ్ కిన్నెర మాల్యాద్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు బజార్ అర్బన్ పి హెచ్ సిడాక్టర్ హన అంజుమ్ ,ఆరోగ్యశాఖ సిబ్బంది అమూల్య, ల్యూసి, లలిత , డేటా ఎంట్రీ వర ప్రసాద్ ,వైసీపీ నాయకులు, కార్యకర్తలు సాగర్,రవి, వేణు,అశోక్, ,అవినాష్, అనీష్ తదితరులు పాల్గొన్నారు.