ప్రాణం ఉన్నంత వరకు సాదుచెట్టి కులాభివృద్ధికి కృషి చేస్తా-గోవింద్ రాజు

 


State politics news{nellore}:

ప్రాణం ఉన్నంతవరకు సాదుచెట్టి కులాభివృద్ధికి కృషి చేస్తానని నూతన జిల్లా అధ్యక్షుడు కాయం గోవింద్ రాజులు పేర్కొన్నారు. సాదుచెట్టి కుల సంఘీయులు తనపై ఉంచిన నమ్మకాన్ని బాధ్యత గా తీసుకుని కుల దైవం అయిన కామాక్షమ్మ దేవస్థానాన్ని జిల్లా లో నిర్మిస్తామని ఆయన తెలిపారు. ఆదివారం సాదుచెట్టి జిల్లా అధ్యక్షుడు ఎన్నికలు నెల్లూరు నగరంలోని నవాబుపేట్, రైతు బజార్ వద్ద నిర్వహించారు.దాదాపుగా 260 ఓట్లకు గాను204 ఓట్లు పోలైనాయి. అందులో కాయం గోవింద రాజుకు 148 ఓట్ల మెజార్టీతో తన సమీప అభ్యర్థి కందప్ప పై గెలుపొందారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు గోవింద్ రాజు మాట్లాడుతూ.. తమ కుల సంగీయులు సాదుచెట్టి అభివృద్ధి కి కృషి చేస్తానని తెలిపారు.అనంతరం నెల్లూరు నగర వైసీపీ బీసీ సెల్ అధ్యక్షుడు ఉప్పల శేషు గౌడ్ శాలువా కప్పి, పూల మాల వేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో దొళ్ళు దుర్గా ప్రసాద్, కోటా రామకృష్ణ, కాయం లోకయ్య,వొమ్మి శివాజీ, తిమ్మిరి దాము, త్యాగ తదితరులు పాల్గొన్నారు.