State politics news{nellore}:
ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక స్టోన్హౌస్పేట నందుగల సోమవారం రేబాల సుందరరామిరెడ్డి నగరపాలక ఉన్నత పాఠశాల లో సైన్స్ ఉపాధ్యాయుడు సతీష్ కుమార్ మురిగిపూడి విద్యార్థులచే నీటి పొదుపు కై ప్రతిజ్ఞ చేయించారు. నీటిని సంరక్షిస్తుందని పొదుపుగా వాడుకుంటానని, ఒక్క బొట్టు కూడా వృధా చేయం అని వారి చేత ప్రతిజ్ఞ చేయించారు. నీరు వృధా కాకుండా చూడడంలో కుటుంబ సభ్యులు, మిత్రులు ఇరుగుపొరుగువారిలో చైతన్యం కలుగ చేస్తానని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ భూగోళంలో నీరు ఎక్కువగా ఉన్నప్పటికీ దానిలో ఎక్కువ భాగం ఉపయోగపడని ఉప్పు నీటి రూపంలోసముద్రాలలో మహాసముద్రాలలో కొన్ని సరస్సులలో, మంచు రూపంలో ధ్రువ ప్రాంతాలలో ఎక్కువగా ఉన్నదని మిగిలిన నీటిని మనం సక్రమంగా వినియోగించుకోవాలని లేకపోతే ఎవరో ఒక మిత్రుడు చెప్పిన విధంగా మన తాతలు చెరువుల్లో నీరు చూశారని, మన తండ్రులు బావుల్లో నీరు చూశారని, మనం కుళాయిల్లో నీరు చూస్తున్నామని భవిష్యత్తులో మన వాళ్ళు కన్నీళ్ళలో నీరు చూడవలసి వస్తుందేమోనని తెలియజేయడం నిజమేననిపిస్తోందన్నారు. సంపద కోసం యుద్ధాలు జరిగాయి,ఈనాడు పెట్రోల్ లాంటి వనరుల కోసం యుద్ధాలు జరుగుతున్నాయన్నారు.భవిష్యత్తులో నీటి కోసం దేశాల మధ్య యుద్ధాలు జరుగుతాయో,ఏమో అని అనుటలో అతిశయోక్తి లేదని తెలియజేశారు. కాబట్టి విద్యార్థులు ఈ నాటి నుంచే నీటిని పొదుపు చేయడంలో తమ వంతు పాత్ర పోషించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు మధుబాబు, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#