భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యం- మంత్రి మేకపాటి ప్రణాళిక

 


State politics news {Amaravathi}:

★సీఎం ఆలోచనలను మరింత వేగంగా ఆచరణలో పెట్టే దిశగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఢిల్లీ టూర్


★మూడురోజులు డిల్లీ టూర్


 ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలను ఆచరణలో పెట్టి పెట్టుబడులుగా మలిచే దిశగా పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఢిల్లీ పర్యటన. మార్చి 17,18,19 తేదీలలో 3 రోజులపాటు హోటల్ తాజ్ ప్యాలస్ లో నిర్వహించే పెట్రో కెమ్ సదస్సు సహా పలు కీలక మంత్రులతో సమావేశమయ్యేలా ఆయన ఢిల్లీ పర్యటన షెడ్యూల్ ఖరారయింది.  తొలి రోజున అనగా 17వ తేదీన న్యూ ఢిల్లీలో జరిగే 11వ ఇండియా కెమ్ అంతర్జాతీయ సదస్సులో మంత్రి మేకపాటి పాల్గొననున్నారు. సుమారు 100కు పైగా దేశాల నుంచి 7,000 మందికిపైగా వ్యాపార ప్రతి నిధులు హాజరయ్యే ఈ సదస్సులో వివిధ కంపెనీలతో ఒప్పందం చేసుకునేందుకు మంత్రి మేకపాటి  నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం ప్రణాళికలను పూర్తి చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో హెచ్పీసీఎల్, ఓఎన్జీసీ, బీపీసీఎల్, ఇండియన్ ఆయిల్, కెయిర్న్ వంటి సంస్థలు రూ.17, 760 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టడమే కాకుండా పలు విస్తరణ కార్యక్రమాలు కూడా చేపడుతున్నాయి. ముఖ్యమంత్రి మార్గనిర్దేశం, మంత్రి మేకపాటి కృషితో విశాఖ-కాకినాడ పెట్రో కెమికల్ కారిడార్ తో పాటు కృష్ణపట్నం నోడ్ లో పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీలతో ఒప్పందాలు కుదిరే అవకాశముంది. పెట్రో కెమికల్స్ రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా  మంత్రి గౌతమ్ రెడ్డి, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారని చెప్పవచ్చు. రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మొదటి ర్యాంకులో ఉంది. చౌక వాణిజ్యానికి చిరునామాగా మారింది. వీటిని అవకాశాలుగా మార్చుకుని పారిశ్రామికంగా అగ్రస్థానంలో ఏపీని నిలబెట్టడానికి మంత్రి మేకపాటి నిశ్శబ్దంగా తన పని చేస్తూ ముందుకు వెళుతున్నారు.


ఢిల్లీ పర్యటనలో తొలి రోజు మధ్యాహ్నం నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్ ఆధ్వర్యంలో ఐటీసీ మౌర్యా హోటల్ వేదికగా జరగబోయే మరో  "టెక్నికల్ టెక్స్ టైల్స్" జాతీయ స్థాయి సదస్సులో కూడా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పాల్గొంటారు. చేనేత, జౌళి రంగాలలో  అవకాశాలపై టెక్నోటెక్స్ -2021 జాతీయ సమావేశంలో పాల్గొని 1.10గం.లకు ప్రసంగించనున్నారు.  18, 19 తేదీలలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కేంద్రంలోని పలు కీలక మంత్రులతో సమావేశమవనున్నారు. సరకు రవాణాకు సంబంధించిన మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పాలసీ ఆలోచనను ఆచరణలో పెట్టే దిశగా మంత్రి మేకపాటి కేంద్ర ఓడరేవు, పోర్టుల శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయతో భేటీ అవనున్నారు.  కేంద్ర ఐ.టీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ను కలిసే అవకాశం ఉంది. కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర ఎమ్ఎస్ఎమ్ఈ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి స్మఈతీ ఇరానీ, కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ తదితర కేంద్ర మంత్రులను కలసి, రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి గురించి మంత్రి కేంద్రమంత్రులకు వివరించనున్నారు. వినూత్న ఆలోచనలను పెట్టుబడులుగా మార్చుకునే అవకాశాలను వివరించి కేంద్ర సహకారం మంత్రి మేకపాటి కోరనున్నారు .