విఆర్ కళాశాలలో భారీ అగ్నిప్రమాదం

 




State politics news{nellore}:

 నెల్లూరు విఆర్ కళాశాలలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పలు కీలకమైన పత్రాలు, కంప్యూటర్లు ఉన్న గది అగ్నికి ఆహుతయింది. కీలక పత్రాలున్న గది తగులపడటంతో పలు అనుమానాలుకు దారి తీస్తుంది. కాలేజి కరస్పాండెంట్ కార్యాలయం పై గది అగ్నికి ఆహుతి కావడం చేతి వాటంగా అనుమానం వ్యక్తమవుతున్నది. గతంలో ఇదే గదిలో చోరీ జరిగి పలు కీలక పత్రాలు మాయమయ్యాయి.

       ఒకటోవ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన ఇంకా పురోగతి  కానరాలేదు.కాలేజికి సంబంధించిన వివాదాస్పద పత్రాలను సీజ్ చేసిన జాయింట్ కలెక్టర్ గదిలోనే ఉంచారు.అవి కూడా
తగులపడిపోయాయి.
దీనిపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.మంటలను అదుపులోకి ఆర్పేందుకు పైరింజన్ అక్కడికి చేరుకుని అదుపు చేసింది.కానీ ఆ గది అంతా పొగతో నిండివుంది.దీనిపై ఉన్నతాధికారులు ఏవిధంగా స్పందిస్తారో వేచిచూద్దాం.#ఎస్పీన్యూస్#