State politics news[Nellore]:
విద్యావేత్త, మృదు స్వభావి, స్నేహశీలి, తెలుగు భాషోద్యమ సమితి అధ్యక్షుడు కీ"శే" ఆచార్య ఆదిత్య ఆదర్శ ప్రాయుడని పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.మురళీమోహన్ రాజు పేర్కొన్నారు. పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నెల్లూరు బాలాజీనగర్ లోని గీతామయి వృద్దుల ఆశ్రమం నందు ఆచార్య ఆదిత్య సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాష అభివృధ్ధికోసం నిరంతరం కృషి చేసిన ఆదిత్య సేవలు ఎనలేనివని తెలియజేసారు. గీతామయి వృద్ధాశ్రమ నిర్వాహకురాలు తమ్మినేని సరళ మాట్లాడుతూ అందరితో స్నేహంగా మెలుగుతూ, నలుగురి మంచిని కోరే ఆదిత్య లేకపోవడం ఎంతో బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు టి.వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు రవి గోగులపల్లి తదితరులు పాల్గొన్నారు.