State politics news{nellore}:
నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల కోసం డివిజన్ల పునర్విభజన ప్రక్రియ ఓటర్ల జాబితా మాయల ఫకీర్ మంత్రజాలంలా వైసీపీ నేతలు తయారు చేశారని టీడీపీ మాజీ కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ మండిపడ్డారు. సోమవారం నగరంలోని మినీ బైపాస్ రోడ్, ఎన్టీఆర్ భవన్ లో విలేకరులతో మాట్లాడారు.అక్రమంగా తప్పుల తడకలతో చేసిన పునర్విభజనను రద్దు చేసి తిరిగి మరలా శాస్త్రీయబద్ధంగా చేయాలన్నారు.2019 లో హైకోర్టు రద్దు చేసిన పునర్విభజననే తేదీ మార్చి 2021లో ఆమోదించారని దుయ్యబట్టారు. జీ.ఓ నెంబర్ 570 డి లిమిటేషన్ ప్రకారం డివిజన్ల వారీగా 10 శాతం ఓట్లు మార్పులు చేసుకోవచ్చని చట్టంలో చెబుతుంటే వైసీపీ నాయకులు మాత్రం దారుణంగా వేల ఓట్లు తేడాతో ఓటర్ల జాబితాలు తయారు చేసారని తీవ్ర విమర్శలు చేసారు. ఓట్ల విభజన ప్రక్రియను చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్నారని అధికార పార్టీ నాయకులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్పొరేషన్ పరిధిలో అక్రమంగా రెండు వేల ఏడు వందల అడ్రెస్ లేని ఓట్లు జత చేశారని,40 రూపాయలు ఇంటిపన్ను కట్టే చిన్న ఇంట్లో 700 ఓట్లు!ఏమిటీ ఈదారుణమన్నారు. ఒక డివిజన్లలో 15 వేల ఓట్లు, కొన్ని డివిజన్లలో 5 వేల ఓట్లా..!?అంటే వైసీపీ ముఖ్య నాయకుల డివిజన్లలో అతి తక్కువ ఓట్లా? ఇదేమి వైసీపీ నేతల మాయ జాలం అని ఆయన ప్రశ్నించారు. ఓటర్ల జాబితా అక్రమాల పై అధికార పార్టీ అనుకూలంగా అధికారులు వ్యవహరిసున్నారని ఇది మంచి పద్ధతి కాదన్నారు.
ఇన్ని అక్రమాలు ఉన్నాయి కాబట్టే పునర్విభజనను పేపర్ పబ్లికేషన్ చేయలేదన్నారు. ఇకనైనా అధికారులు వెంటనే ఈ పునర్విభజనను రద్దు చేసి రాజకీయలకతీతంగా పునర్విభజన చేయని పక్షంలో తిరిగి హైకోర్టును ఆశ్రయించాల్సి వస్తుందను తెలియచేస్తున్నామని హెచ్చరించారు.