★ఆలయంలో కానరాని నవీ"న్"కరుణ..?
★ శివాలయంలో వసతులు లేక భక్తుల ఇక్కట్లు..
★ ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్ళు ఎక్కడా..!?.
★వేసవి కాలం కావడంతో మండుటెండలో భక్తుల అగచాట్లు..కాళ్ళు మాడాల్సిందేనా..?
★పాలకులకు,అధికారులకు భక్తులంటే అంత చిన్నచూపేల?
★ఆలయానికి ఆస్తులున్నా .. భక్తులకు సదుపాయలు కల్పించడంలో అలసత్వమేమిటి..!?
★అసలు స్వామివారి ఆస్తులు ఉన్నాయా? స్వాహా అయిపోయాయా?
■"శివ శివా.. మాగోడు పట్టించుకోవయ్యా"■
నెల్లూరు నవాబుపేట శివాలయం భక్తుల ఇక్కట్లు అంతా ఇంతా కాదు.దేవుడి కోసం భక్తి శ్రద్ధలతో ఆలయానికి వచ్చే భక్తులకు వసతులు లేక అగచాట్లు ఆశివుడికెఱుక..!?
వేసవి కాలం వస్తుందంటే ఆలయంలో చలువ పందిర్లతో ఆలయాలు ముస్తాబవుతాయి.భక్తుల ప్రదక్షిణలు కోసం ఎండ పడకుండా సౌకర్యాలు కల్పిస్తారు ఆలయ అధికారి. అయితే అందుకు భిన్నంగా.. చలువ పందిరి లేదు... ఎండలో సైతం భక్తులు కాళ్ళు కాలుతూ.. ప్రదక్షణలు చేస్తూ.. మా గోడు పట్టించుకో శివయ్యా అంటూ...మా బాధలు చెప్పుకోవడానికి ఆలయానికొస్తే ఆశివయ్యకి చెప్పే లోపే కాళ్ళు మాడ్చు కోవాల్సిన పరిస్థితి దాపురించిందని ఆలయానికి వచ్చే భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆలయంలో వసతులు లేవు.. ఎవర్ని అడగాలో తెలియదు.
ఆలయంలో వసతులు లేకపోవడంతో ఎవర్ని అడగాలో తెలియక జవాబు చెప్పేవారు ఆలయంలో లేరు.ఇంకా ఆలయానికి ఎవరు వస్తారు.
★కృష్ణ (భక్తుడు)★
భక్తులకోసం ఆలయాలా..!. లేక అధికారులు ,పాలకులు సొమ్ము చేసుకునేందుకా....!?
భక్తుల సౌకర్యాలు కల్పించి ఆలయాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఆయా పాలకులు, ఆలయాధికారి పై ఉంది. అసలు ఆలయంలో వసతులు ఏమైనా ఉన్నాయా.. అని పర్యవేక్షణ చేయని ఈ ఓ ఉన్నారా లేరా మా గోడు ఎవరు పట్టించుకుంటారు.ఆలయంలో వచ్చే సొమ్ము ఏమవుతుంది.
★ మస్తాన్ ,(భక్తుడు)★
భక్తులు నుండి వస్తున్న ఆరోపణలపై జిల్లా దేవాదాయ ధర్మాదాయశాఖ అధికారులు స్పందించి తక్షణమే విచారణ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.