రక్తదానం చేయండి- ప్రాణదాతలు కండి

 


State politics news(nellore):

 దేశం స్వాతంత్రం కోసం ముగ్గురు యువకులు భగత్ సింగ్,రాజ్ గురు, సుఖ్ దేవ్ లు ప్రాణాలర్పింపించిన మార్చి 23న తేదీన అమర వీరుల దినంగా పాటించి దేశం అంజలి ఘటించాలని జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు పేర్కొన్నారు. గురువారం నెల్లూరులోని కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ నందు నెల్లూరు జిల్లా కలెక్టర్  కె.వి.ఎన్. చక్రధర్ బాబు మార్చి 23న జరగబోయే మెగా రక్తధాన శిబిరంలో యువత ఉత్సహంగా పాల్గొనాలని పిలుపు నిచ్చి బ్రోచర్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఫోరమ్ ఆఫ్ ఆర్ట్స్&ఆక్టివిటీస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఒకేసారి 26 రాష్ట్రాలలో మెగా రక్తదాన శిబిరం జరుగుతుందని కావున అధిక సంఖ్యలో యువత పాల్గొని రక్త దానం చేయాలని పిలుపునిచ్చారు.రక్త దానం చేసి ప్రాణ దాతలు కావాలని యువతిని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.మురళీమోహన్ రాజు, నెహ్రూ యువకేంద్ర డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఆకుల మహేంద్ర రెడ్డి,టి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.