గత రెండురోజుల క్రితమే స్టేట్ పాలిటిక్స్ చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుందని చెప్పాము.అది అక్షర సత్యమైంది. మార్చి 31వ తేదీకి ప్రస్తుత ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ పదవి కాలం పూర్తవుతుంది. తదుపరి ఎలక్షన్ కమిషనర్ గా నీలం సాహ్ని ఎలక్షన్ కమిషనర్ గా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.ఏప్రిల్1వ తేదీన బాధ్యతలు స్వీకరిస్తారని సమాచారం. అనంతరం ఏప్రిల్ మొదటి వారంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్ జరగనున్నట్లు సమాచారం.