మూలస్థానేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల గోడ పత్రికను విడుదల చేసిన మంత్రి అనిల్



State politics news(nellore):

 నెల్లూరు నగరంలోని మూలాపేట నందు గల శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో మార్చి 6 నుంచి 18 వరకు జరుగు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై  సంబంధిత అధికారులతో జలవనరుల శాఖ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం బ్రహోత్సవాలకు సంబంధించిన గోడ పత్రికలు, బ్రోచర్ లు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మెన్ లోకిరెడ్డి వెంకటేశ్వర్లు రెడ్డి, నెల్లూరు ఆర్డీవో హుస్సేన్ సాహెబ్,నగర డిఎస్పీ శ్రీనివాసులురెడ్డి,వైసీపీ నేత నూనె మల్లికార్జున్ యాదవ్,ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.