State politics news【Nellore】:
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో తిరుపతి పార్లమెంట్ వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి నామినేషన్ దాఖలు చేసారు.సోమవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో వైసీపీ తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయిన జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు కి నామినేషన్ పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా వైకాపా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో వి.ఆర్.కళాశాల కూడలి నందు గల డా౹౹బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహం దగ్గర నుండి నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ఎమ్మెల్యే కాకాణి ఆధ్వర్యంలో వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ముందు భాగాన సాధారణ ప్రజలతో నడిచి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి , రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ నామినేషన్ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి , జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసులురెడ్డి , పంచాయతీరాజ్ శాఖ మాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి , వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు , విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ , పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి , జనవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ , పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని , రవాణా శాఖ మంత్రి పేర్ని నాని , రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి , ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ,శాసన సభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి , మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి , కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి , కిలివేటి సంజీవయ్యగారు, వెలగపూడి వరప్రసాద్ , భూమన కరుణాకర్ రెడ్డి, బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆదిమూలం, తోపుదూర్తి ప్రకాష్ రెడ్డి , కొలుసు పార్థసారధి , పిన్నెలి రామకృష్ణ రెడ్డి , రవీంద్రనాధ్ రెడ్డి , పెద్దిరెడ్డి ద్వారకనాధ్ రెడ్డి , చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి , శాసన మండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి తదితరులతో పాటు నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు చెందిన ప్రధాన నాయకులు పాల్గొన్నారు.