State politics news【nellore】:
మంచి నీళ్లకోసం తమకు తెలపాలని ప్రజలెవ్వరు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని 7వ డివిజన్ వైసీపీ ఇంఛార్జ్ మాల్యాద్రి తెలిపారు.నెల్లూరు నగరంలో 3 రోజులు పాటు మంచినీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు నగర కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపిన సంగతి విదితమే.డివిజన్ లోని వీవర్స్ కాలనీ, జాఫర్ సాహెబ్ కాలువ కట్టకి శుక్రవారం మంచి నీరు టాంకర్లు ద్వారా సరఫరా చేయడం జరిగిందన్నారు. ఇంకా ఎవ్వరికైనా మంచినీరు రాని ఎడల తమ దృష్టికి తీసుకు రాగలరని అన్నారు.
సంగం నుంచి నెల్లూరు కు తాగునీటి సరఫరా చేసే పైప్ లైన్లు అనుసంధానం చేస్తున్నారని దీని వల్ల పనులు జరుగుతుండటంతో ప్రజలు 3రోజులు పాటు అవస్థ పడాల్సిన అవసరం లేదని,మంచినీరు టాంకర్లు ద్వారా మంచినీరు సరఫరా చేయడం జరుగుతుందని డివిజన్ ప్రజలకు ఆయన తెలియజేసారు. ఎవ్వరికైనా మంచినీరు రాని యడల తమ దృష్టికి తీసుకు రాగలరని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో యువనేత కిన్నెర సాగర్, కార్యకర్తలు అశోక్,సురేష్ తదితరులు పాల్గొన్నారు.