ఏపీ యస్ ఈ సి గా నీలం సాహ్ని..!?


 


State politics news【Amaravathi】:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ గా మాజీ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని ని త్వరలో నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నారు.

                ప్రస్తుతం ఉన్న ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ పదవీ కాలం  ఈ నెల31వ తేదీకి గడువు ముగిస్తుంది. ఆయన పదవీ కాలం పొడిగిస్తారో లేక ఈ నెలాఖర వరకు ముగిస్తోందో.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం లో ఉంది. ఏదిఏమైనా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  నీలం సాహ్నికి అదృష్టం వరించేటట్లు ఉంది.ఎందుకంటే ఆమె పనిచేసిన పదవీ కాలంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి మెచ్చేటట్లు ఆమె పనితీరు ఉండటంతో సీఎం మనసులో ఆమెకు మరల అవకాశం కల్పించాలని ఉద్దేశంలో ఉన్నట్లు సమాచారం. ఏప్రిల్ నెలలో నూతన యస్ ఈ సి గా బాధ్యతలు ఎవరు తీసుకుంటారో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్ అవుతుంది.