State politics news【nellore】:
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ జన్మదిన సందర్భంగా వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి హాజీ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని వి ఆర్ సి కూడలిలో చలివేంద్రంను మంగళవారం ప్రారంభించారు.రానున్న వేసవి తాపం తీర్చడానికి తమవంతుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటామని హాజీ తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం విఆర్సీ సెంటర్. అటువంటి ప్రాంతంలో సామాన్య ప్రజలు వేసవి తాపానికి ఇబ్బందులు పడకూడదని మంత్రి అనిల్ కుమార్ జన్మదిన సందర్భంగా ఈ సేవా కార్యక్రమం చేపట్టామని తెలిపారు.ఈ సందర్భంగా తానే స్వయంగా పలువురికి చలివేంద్రం నుండి దాహార్తి తీర్చేందుకు గ్లాస్ లో నీరు పోశారు.